భార్య జడతో భర్త ఉపాధి హజరు సేఫ్!

5చూసినవారు
జనగామ జిల్లా కృష్ణాజిగూడెంలో ఇటీవల చనిపోయిన వ్యక్తి కొడుకు గుండు చేయించుకున్నాడు. కర్మకాండల అనంతరం ఉపాధి హామీ పనికి వెళ్లగా, ఫేస్ ఐడెంటిఫికేషన్ యాప్ అతన్ని గుర్తించలేకపోయింది. దీంతో హాజరు నమోదు కాలేదు. ఈ సమస్యను అధిగమించడానికి, అతను తన భార్య జడతో కలిసి ఫోటో దిగి యాప్‌లో అప్‌లోడ్ చేయగా హాజరు నమోదైంది. ఇలాంటి సమస్యలు చాలా ప్రాంతాల్లో ఎదురవుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కూలీలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్