జనగామ జిల్లా యువజన, క్రీడల అధికారి కోదండరాములు తెలిపిన వివరాల ప్రకారం, అగ్నిపథ్ స్కీంలో భాగంగా 2027 సంవత్సరానికి అగ్నివీర్ నియామకాల కోసం పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. వివాహం కాని, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై, 01-07-2005 నుండి 01-07-2009 మధ్య జన్మించిన వారు అర్హులు. ఆసక్తి గల యువకులు ఏప్రిల్ 1, 2026 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.