స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనగామ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగేందుకు యువత సిద్ధమవుతోంది. అయితే, గతంలో పోటీ చేసి గెలిచినవారు మాత్రం తొందరపడి అప్పులు చేసి జీవితాలను పాడు చేసుకోవద్దని యువతకు సూచిస్తున్నారు. గెలిచినా, ఓడినా ప్రస్తుత పరిస్థితులు బాగాలేవని వారు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సర్పంచ్, ఎంపీటీసీగా గెలిచినవారు గతంలో హమాలీ పనులు చేసుకున్న సందర్భాలున్నాయని, పుట్టెడు అప్పులతో నేటికీ నిద్రలేని వారు ఉన్నారని తెలిపారు.