జనగామ: బైక్ లో మంటలు.. పాక్షికంగా దగ్ధం!

7చూసినవారు
జనగామ జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలోని హోటల్ వద్ద యువకుడి బైక్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఇంజిన్ వేడెక్కడం, ఎండ తీవ్రతతో బైక్‌లో మంటలు చెలరేగాయి. స్థానికులు, హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది, అయితే బైక్ పాక్షికంగా దెబ్బతింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్