జనగామ: కలెక్టర్ క్యాంపస్ లో ఇంకుడు గుంత

67చూసినవారు
జనగామ: కలెక్టర్ క్యాంపస్ లో ఇంకుడు గుంత
భూగర్భ జలాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జిల్లాలో "మన జిల్లా- మన నీరు " కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరే పలుగు, పార పట్టి ఇంకుడు గుంతను తవ్వారు. బాధ్యతతో మా ఇంట్లో ఇంకుడు గుంతను నిర్మించా.. మీరు సైతం మీ ఇళ్లల్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్