జనగామ: కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూమ్

7చూసినవారు
జనగామ: కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లకు కంట్రోల్ రూమ్
ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి జనగామ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ రిజ్వాన్ బాషా ఈ కంట్రోల్ రూమ్ సెంటర్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే 8520991823 నంబర్‌కు సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.