పువ్వులను పూజించే బతుకమ్మ పండుగ సందర్భంగా, ఆదివారం జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మకు పువ్వుల కొరత ఏర్పడింది. అడవుల్లో విరివిగా దొరికే తంగేడు, గునుగు, ముత్యాలపువ్వు ఈసారి తక్కువగా పూయడంతో, పువ్వులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో జనగామ జిల్లాలో పువ్వుల ధరలు విపరీతంగా పెరిగాయి. బంతి పూలు కిలో రూ. 100-150 వరకు, తంగేడు, గునుగు పువ్వుల చిన్న కట్టలు రూ. 30-50 వరకు అమ్ముతున్నారు.