జనగామ: మధ్యాహ్న భోజన ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్

70చూసినవారు
జనగామ: మధ్యాహ్న భోజన ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్
ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలనకు జనగామ జిల్లాలో రెండు ప్రత్యేక బృందాలను గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఏర్పాటు చేశారు. ఒక బృందానికి టీం లీడర్ గా జనగామ జిల్లా జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్ తో పాటు పలువురు అధికారులను నియమించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, జఫర్ గడ్, చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల్లోని పాఠశాలలోని ఆహార నాణ్యతను పర్యవేక్షిస్తారు.