జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం హనుమాన్ టెంపుల్ వద్ద సోమవారం అఖిల భారతీయ మార్వాడి యువ మంచ్ జనగామ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిసిపి రాజమహేంద్ర నాయక్, సీఐ సత్యనారాయణ హాజరై రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. యువత ఎక్కువగా రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో మార్వాడి యువ మంచ్ సభ్యులు, ఆలయ కమిటీ ఛైర్మన్ విజయ్ కుమార్ బజాజ్ పాల్గొన్నారు.