జనగామ: సైబర్ నేరగాళ్ల వలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

5చూసినవారు
జనగామ: సైబర్ నేరగాళ్ల వలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ 'వికసిత్ భారత్' పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ అనంత రామిరెడ్డిగా పరిచయం చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి, అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు. నియోజకవర్గం నుంచి 40 మంది లబ్ధిదారుల జాబితా పంపాలని, దరఖాస్తుకు ఈ రోజే చివరి రోజని ఒత్తిడి తెచ్చాడు. ఒక్కో దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2,500 చొప్పున, మొత్తం 40 మందికి రూ.లక్ష ఫోన్ పే చేయాలని కోరాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్