ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే మీడియా సంస్థలపై రాజకీయ కక్ష్యసాధింపు చర్య అని పలువురు పాత్రికేయులు అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం జనగామ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు జనగామ, పాలకుర్తి, దేవరుప్పుల తదితర మండల కేంద్రాల్లో శ్రీనివాసారావు అక్రమ అరెస్టు, సాక్షి దినపత్రిక కార్యాలయంపై దాడిని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.