జనగామ: పట్టిస్తే రూ. 10 వేలు.. ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా!

0చూసినవారు
జనగామ: పట్టిస్తే రూ. 10 వేలు.. ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా!
జనగామ జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛందంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూర్, చిన్నరామన్ చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామాల్లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నారు. తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నారు. మద్యం తాగిన వారిని, అమ్మిన వారిని పట్టుకున్న వారికి రూ. 10 వేలు నజరానా ప్రకటించి, కఠినంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్