జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, వర్షాల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.