జనగాం-సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల గణపురం మండలం నవాబుపేట వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వనపర్తి జిల్లాకు చెందిన దరిపల్లి నరసింహులు, వనపర్తి శివారు మర్రితండాకు చెందిన మోతీరాం ఈ ప్రమాదంలో మరణించారు. అదే తండాకు చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.