తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తూడి అంజయ్య, ఏప్రిల్ 7వ తేదీన జనగామలో నిర్వహించనున్న జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో మహాసభల గోడపత్రికను ఆవిష్కరించిన ఆయన, జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు.