జ్ఞాన సరస్వతి ఆలయ వార్షికోత్సవాలు: పంచ వింశతి కలశ అభిషేకం వైభవం

3చూసినవారు
జనగాం జిల్లా కేంద్రంలోని భవానీ నగర్ లోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో 15వ వార్షికోత్సవాలు రెండవ రోజు కుంభారాధన, అగ్ని ఆరాధనలతో పాటుగా అమ్మవారికి పంచ వింశతి కలశ అభిషేకం, పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో ఘనంగా జరిగాయి. రేపు మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ఆశీర్వచనాలతో ఉత్సవాలు ముగియనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్