ప్రజావాణి ఫిర్యాదుతో రైతు కుటుంబానికి న్యాయం

2చూసినవారు
జనగామ మండలం శామీర్పేట గ్రామానికి చెందిన రైతు కుటుంబం ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న వ్యవసాయ భూమి దారి సమస్యకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జోక్యంతో పరిష్కారం లభించింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ, సర్వే అధికారులు భూ రికార్డులను పరిశీలించి 5గుంటల భూమిని నమోదు చేసి వ్యవసాయ భూమికి దారి కల్పించేలా చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 21/A/2/ఆ పరిధిలోని వ్యవసాయ భూమికి సుమారు 60 ఏళ్లుగా వినియోగంలో ఉన్న దారిని పక్క భూమి యజమానులు మూసివేయడంతో గత ఐదేళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని బాధితురాలు తాళ్ల దివ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్