ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, SIR ప్రక్రియలో నాయకులు పోషించాల్సిన పాత్రపై చర్చించారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు. SIR ప్రక్రియలో అర్హులైన ఒక్కరు కూడా ఓటు కోల్పోకుండా చూడాలని నాయకులకు చెప్పారు.