జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వివిధ గ్రామాలలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. రంగాపురం లోని దూదిమెట్ల ఎల్లమ్మ, రామవరం గ్రామంలోని తోట వజ్రమ్మ కుటుంబ సభ్యులను కలిసి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతులకు నివాళులర్పించి, వారి ఫోటోలపై పూలు చల్లారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.