జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో గురువారం గంటెమ్మ చెరువు మత్తడిలో కొట్టుకుపోయి సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. పంతంగి చంద్రమౌళి, వడాల పెద్దులు అనే గొర్రెల కాపరులకు చెందిన ఈ గొర్రెలు మరణించడంతో, బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.