
ఖమేనీ మృతి వార్త చదువుతూ ఏడ్చేసిన టీవీ యాంకర్
ఇరాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తను ప్రకటించే సమయంలో ఒక టీవీ యాంకర్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




