జనగామ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో జనగామ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, ఛైర్పర్సన్ కడకంచి బాలమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పట్టణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.