రోడ్డు ప్రమాదం ఓ డాక్టర్, మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను బలితీసుకుంది. ఈ విషాద ఘటన జనగామ(D) రఘునాథపల్లి(M) గోవర్ధనగిరిలో శనివారం జరిగింది. హనుమకొండ(D) నయీంనగర్‌కు చెందిన మహ్మద్ రహముద్ధీన్ కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. గోవర్ధనగిరి దర్గా సమీపానికి వచ్చాక కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రహముద్ధీన్ కూతురు డెంటిస్ట్ హబీబా హఫ్సా(27), బంధువైన సాఫ్ట్‌వేర్ మహ్మద్ అసదుద్ధీన్ (26) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.