ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నాయని జిల్లా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో కన్వీనర్ రాజు ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో, పాఠశాలల ఫీజుల నియంత్రణపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.