జర్మనీలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన జనగామ జిల్లాకు చెందిన తోకల హృతిక్ రెడ్డి, తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదం నుండి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పై నుంచి దూకాడు. ఈ క్రమంలో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హృతిక్ రెడ్డి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.