జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్ఎస్ఈయూఐ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ చిత్రపటానికి చెప్పులు వేసి నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు తోపులాట జరగడంతో ఓ ఎన్ఎస్ఈయూఐ కార్యకర్త తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. పోలీసుల తీరును నిరసిస్తూ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి వారు నిరసన తెలిపారు. బిఆర్ఎస్ నేతలకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.