ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం: జనగామ కలెక్టర్

15చూసినవారు
జనగామలో 99 రోజుల 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా గురువారం ఎయిడ్స్ పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధిగ్రస్థుల పట్ల వివక్ష చూపవద్దని కోరారు. ఈ ర్యాలీలో మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్