జనగామ జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు, రవాణా వేగంగా జరగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, లోడింగ్, అన్లోడింగ్లో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, వేసవి దృష్ట్యా రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు.