జనగామ మండలం వడ్లకొండకు చెందిన మరాటి దినేష్ (24), సమీప బంధువైన భానూశ్ (21)లు మంగళవారం సాయంత్రం హోలీ ఆడుకుని ద్విచక్రవాహనంపై సిద్దిపేట రోడ్డు నుంచి వంతెన పై వెళ్తుండగా, బస్టాండ్ నుంచి వస్తున్న వ్యాన్‌ను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దినేష్, భూనూశ్ తీవ్రంగా గాయపడగా, వ్యాన్ డ్రైవర్ శివకృష్ణగౌడ్ గాయపడ్డాడు. ముగ్గురిని జనగామ జనరల్ ఆసుపత్రికి తరలించగా, దినేష్, భూనూశ్ హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. సీఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.