చెట్టును ఢీ కొట్టిన కారు ఇద్దరు మృతి

7చూసినవారు
చెట్టును ఢీ కొట్టిన కారు ఇద్దరు మృతి
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మృతులు జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల శివ, లోకేష్ గా గుర్తించారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్