జనగామ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ ఫ్లైఓవర్ పై మోటార్ సైకిల్ ను టాటా ఏసీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు సమాచారం. మృతులు జనగామ జ్యోతి నగర్ కు చెందిన మరాఠీ దినేష్, వడ్లకొండకు చెందిన బాల్దే బానుష్ గా గుర్తించారు. టాటా ఏసీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.