గొర్లవీడులో ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి కుంకుమ పూజ

1300చూసినవారు
గొర్లవీడులో ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి కుంకుమ పూజ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య కమ్యూనిటీ హాల్లో కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మహిళలు పాల్గొని అమ్మవారి ప్రతిమకు కుంకుమ పూజలు, అర్చనలు చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు లోక కళ్యాణ కోసం అగ్ని ప్రవేశం చేసిన త్యాగమూర్తి వాసవి మాత అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్