బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం

జనగామ మండలంలోని గానుగుపహడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయని, వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఉత్సవ విగ్రహంగా ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులకు గానుగుపహాడ్ సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.