Nov 27, 2025, 15:11 IST/పాలకుర్తి
పాలకుర్తి
వరంగల్: తీవ్ర విషాదం.. ఒకేరోజు ఇద్దరు మృతి
Nov 27, 2025, 15:11 IST
పాలకుర్తి మండల పరిధిలోని జీ.డీ. నగర్ లో గురువారం విషాదం చోటు చేసుకుంది. బీసీ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ నలవేణి నరేష్ (37) గుండెపోటుతో మృతి చెందగా, అదే కాలనీకి చెందిన 17 ఏళ్ల శ్రావణి అనారోగ్యంతో మరణించింది. యూనివర్సల్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రావణి గతంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడింది. ఈ రెండు ఆకస్మిక మరణాలతో బీసీ కాలనీవాసులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.