Sep 28, 2025, 04:09 IST/వరంగల్ (ఈస్ట్)
వరంగల్ (ఈస్ట్)
బతుకమ్మపై భిన్నాభిప్రాయాలు: వరంగల్లో ప్రజలు అయోమయం
Sep 28, 2025, 04:09 IST
తెలంగాణ ప్రభుత్వం సద్దుల బతుకమ్మను మంగళవారం చేసుకోవాలని ప్రకటించగా, పద్మాక్షి ఆలయ అర్చకులు శంకర్ శర్మ గారు సోమవారం రోజు బతుకమ్మను ఆడాలని తెలిపారు. దీనితో వరంగల్ త్రినగరి వాసులు అయోమయంలో పడ్డారు. సోమవారం కొందరు, మంగళవారం కొందరు సద్దుల బతుకమ్మను చేసుకుంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాలు ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.