తొర్రూర్ మండలం ఎర్రసోమ్లా తండా వద్ద బుధవారం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తొర్రూర్ డిపోకు చెందిన లగ్జరీ బస్సు HYD నుంచి వస్తుండగా.. ఎర్రసోమ్లా తండా సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. లారీ డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్లే వెనక ఉన్న బస్సు అదుపు చేయలేక ఢీకొందని స్థానికులు చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.