మహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ

1632చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ
మహబూబాబాద్ జిల్లా పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 2,027 పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. తాజాగా గుర్తించిన 77 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ బాధితులకు అందజేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తున్నట్లు మంగళవారం ఎస్పీ తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, IMEI వివరాలతో CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్