మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో శనివారం ఆదివాసీల ప్రజా సంఘాల నాయకులు, ఆదివాసీ ఉద్యోగ సంఘాల నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. మానుకోట జిల్లాలో అక్టోబర్ 26న ఆదివాసీల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రజా సంఘాల జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.