మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వట్టే వాగు సమీపంలో తేలు కాటుతో కిన్నెర క్రిష్ కుమార్ అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. జాతరవద్ద అడవిలో వంట చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేస్తుండగా తేలు కుట్టింది. మొదట మండల కేంద్రంలో వైద్యం చేయించుకున్నా, ఇంటికి వెళ్ళాక వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గూడూరు ఎస్సై తెలిపారు.