చర్లపల్లి నుంచి షాలిమార్ వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించాలని రైల్వే బోర్డు డైరెక్టర్ సంజయ్ ఆర్. నీలం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి మంగళవారం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.