కొత్తగూడలో జంతు మాంసం కలకలం

5చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని జీఎల్ నగర్ ఇండియన్ బ్యాంక్ గల్లీలో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా మాంసం తరలిస్తుండగా, ఒక జంతువు వెనుక భాగం రోడ్డుపై పడిపోయింది. అటవీ శాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెటర్నరీ డాక్టర్‌తో పోస్టుమార్టం నిర్వహించి, శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తామని, రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ జంతువు మాంసమో నిర్ధారిస్తామని, నిందితుల కోసం గాలిస్తున్నామని అధికారి వజాహిత్ తెలిపారు.

ట్యాగ్స్ :