నైనాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణానికి ఏర్పాట్లు ప్రారంభం

0చూసినవారు
నైనాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణానికి ఏర్పాట్లు ప్రారంభం
మహబూబాద్ జిల్లా నైనాల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా దేవుని గుట్ట వద్ద జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ యాసం సంధ్య రమేష్, ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్‌తో కలిసి కల్యాణ మంటపం చుట్టూ మట్టి తోలకం, చదును పనులను శనివారం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం చెట్ల తొలగింపు, మట్టి పోసి చదును పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ పనులకు ఉపసర్పంచ్, JCB, ట్రాక్టర్ దాతలు సహకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు దాతలకు మెండుగా ఉండాలని సర్పంచ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్