
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
కొత్త సంవత్సరం వేళ కూరగాయల ధరలు సామాన్యూలకు షాక్ ఇచ్చాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. తీవ్రమైన చలి వల్ల కూరగాయల దిగుబడి తగ్గి టమాటా, బీర, బెండ కిలో రూ.80-100కు చేరాయి. పచ్చిమిర్చి రూ.100 దాటగా, మునగకాయ ధర కిలో రూ.400 పలుకుతోంది. మరోవైపు చికెన్ కిలో రూ.300, కోడిగుడ్డు ఒక్కోటి రూ.8కు చేరింది. ఇక సంక్రాంతి పండుగకు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.




