వరంగల్ లోని ఎక్సైజ్ కాలనీ జంక్షన్ వద్ద రహదారి గుంతలు, నీటితో చాలా రోజులుగా అధ్వాన్నంగా మారాయి. వర్షం పడినప్పుడు వాహనాలు గుంతల్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడం విచారకరం. ప్రతిరోజూ అధికారులు కూడా ఈ రహదారిపైనే ప్రయాణిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యను అత్యవసరంగా గుర్తించి రహదారిని మరమ్మతులు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.