మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం: బతికున్న రోగిని మార్చురీలో పడేశారు

173చూసినవారు
మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి అని భావించి, ఆస్పత్రి సిబ్బంది ఒక రోగిని బతికుండగానే మార్చురీలో పడేశారు. రాత్రంతా మార్చురీలోనే గడిపిన ఆ వ్యక్తిని, ఉదయం మార్చురీని శుభ్రం చేస్తున్న స్వీపర్ గుర్తించి సిబ్బందికి సమాచారం అందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్