ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Dec 01, 2025, 09:12 IST/

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో.. బాలీవుడ్‌ స్టైల్లో ప్రియురాలికి ప్రపోజ్‌ (వీడియో)

Dec 01, 2025, 09:12 IST
అమెరికాలో నివసిస్తున్న భారతీయ యువకుడు పార్థ్ మానియార్, తన ప్రియురాలు శ్రేయా సింగ్‌కు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద బాలీవుడ్ స్టైల్లో డాన్స్ చేస్తూ వినూత్నంగా లవ్ ప్రపోజ్‌ చేశాడు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియురాలి కళ్లకు గంతలు కట్టి, స్నేహితుల సహాయంతో ఈ ప్రపోజ్ చేశాడు. అనంతరం కుటుంబ సభ్యులు కూడా వచ్చి అతడితో కలిసి డాన్స్ చేయడంతో శ్రేయ భావోద్వేగానికి గురైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాలీవుడ్ సినిమాను తలపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.