మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో శనివారం పామాయిల్ తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైతు భూపతి తిరుపతికి చెందిన ఈ తోటలో ప్రమాదవశాత్తు 'ఎరుగడ' పడటంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో చెట్లతో పాటు, లక్షల రూపాయల విలువైన డ్రిప్ పైపులు, సాగు సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీనితో రైతుకు భారీ నష్టం వాటిల్లింది.