ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన హౌస్ సీలింగ్ వర్కర్లు మహబూబాబాద్ జిల్లా మర్రిపెడలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై బంగ్లా నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా, పాతర్లపాడు స్టేజి సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బైక్ ముందు భాగంలో సీలింగ్ వర్క్ మిషన్లు పెట్టుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదని, మేస్త్రికి సమాచారం అందించామని, అతని ద్వారా పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.