గత నెలలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మేఘనా రాణి మృతదేహం ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఇలా తిరిగి వస్తావని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.