రేవంత్ రెడ్డి హామీలపై బీఆర్ఎస్ నేత ఘాటు విమర్శలు

708చూసినవారు
రేవంత్ రెడ్డి హామీలపై బీఆర్ఎస్ నేత ఘాటు విమర్శలు
ఇనుగుర్తిలో బీఆర్ఎస్ కార్యనిర్వక అధ్యక్షులు బొబ్బిలి మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి హామీలపై ఆదివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రజలను మోసం చేస్తున్నారని, ఇవి కేవలం ఎన్నికల కోసం ఇచ్చిన మాటలేనని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలపై నిజంగా పని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని, వాగ్దానాలను నిష్పక్షపాతంగా, నిజాయితీతో అమలు చేయడం ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల్లో హామీలపై అసంతృప్తి పెరిగిపోయిందని, తక్షణమే ఫలితాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్